Friday, December 27, 2024

మేనమామ కూతురే అని ప్రేమిస్తే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేనమామ కూతురే గదా అని ప్రేమించిన ఆ యువకుడికి మరణం తప్పలేదు. సొంత మేనమామే తన మేనల్లుడిని పొట్టనబెట్టుకున్న ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దండేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన దుడ్డంగుల అనిల్ తన మేనమామ కూతురుని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా అనిల్ ని ఇష్టపడింది. కానీ ప్రతి కథలో ఓ విలన్ ఉన్నట్లుగానే వీరి కథలో యువతి తండ్రే కాలయముడయ్యాడు. తన కూతుర్ని ప్రేమిస్తున్న మేనల్లుడిపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైన మట్టుబెట్టాలని పథకం వేశాడు.

Also Read: కేజ్రీవాల్‌కు 56 ప్రశ్నలు!

ఆ యువకుడిని తన మేనమామ నీతో మాట్లాడే పనుందని చెప్పి లక్సెట్టిపేట మున్సిపాలిటీ శివారులోకి తీసుకెల్లాడు. తను ముందుగానే బీరులో గడ్డిమందు కలిపి సిద్దంగా ఉంచుకున్నాడు. అల్లుడిని కత్తితో బెదిరించి బీర్ తాగించాడు. అనిల్ అపస్మారక స్థితిలోకి వెల్లగానే మేనమామ అక్కడి నుంచి జారుకున్నాడు. అటుగా వెల్తున్న వారు గమనించి ఆసుపత్రికి తరలించారు. యువకుడు చికిత్స పొందుతూ జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించాడు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్సోయాడు. యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు మేనమామపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లక్షెట్టి పేట పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News