సిద్దిపేట : ఎస్సీ వర్గీకరణపై 29 సంవత్సరాలుగా రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్నామని భవిష్యత్తులో కూడా పోరాటాలకు వెనక్కి తగ్గేది లేదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థ్ధాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం సిద్దిపేటలో జరిగిన ఎంఎస్‌పి, ఆర్‌పిఎస్, ఎంఎస్‌ఎఫ్ అనుబంధ సంఘాల జిల్లా సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా నిర్బందాలు విధించిన ప్రాణాలకు తెగించి ఎస్సీ వర్గకరణ కోసం భవిష్యత్తులో పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. 2000 సంవత్సరంలో వర్గీకరణ సాధించుకొని ఎంతో మంది మాదిగలకు ఉద్యోగ అశకాశాలు తెచ్చుకున్నామన్నారు. మాల కులస్థ్ధులు సుప్రీం కోర్టు వెళ్లడం ద్వారా వర్గకరణ రద్దు అయిందన్నారు.
వర్గీకరణ కోసం ప్రతి పక్షం అధికార పక్షం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అఖిల పక్షాన్ని డిల్లీకి తీసుకువెళ్లడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణ ఏర్పాటులో మాదిగలు కీలక పాత్ర పోషిస్తూ రాజకీయంగా మాదిగలకు కనీసం గౌరవం లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 శాతం ఓటింగ్ ఉన్న మాదిగ కులస్తులకు మంత్రి వర్గంలో చోటు కల్పించకపోవడం శోచనీయమన్నారు. సీఎం కేసీఆర్ ఆనాధ పిల్లల కోసం ఇచ్చిన హమీలను నేరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు లింగంపల్లి శ్రీనివాస్,మల్లేశం, పెరుక పర్శరాములు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.