Monday, November 25, 2024

అడ్డు అదుపు లేని చికెన్ ధరలు

- Advertisement -
- Advertisement -

గోవిందరావుపేట: లైసెన్స్ లేకుండా అడ్డు అదుపు లేకుండా రేట్లు విచ్చలవిడిగా పెంచుకొని చికెన్ విక్రయాలు జోరుగా చేస్తున్నారు. మేజర్ గ్రామ పంచాయతీ అయిన పస్రాలో రామాలయం సమీపంలో చికెన్ సెంటర్‌ల వద్ద అమ్మకాలు వారి ఇష్టారాజ్యంగా వారికి నచ్చిన రేట్లకే సుమారు కెజికి రూ.60 నుండి రూ.80 వరకు పేపర్ ధరకంటే అధికంగా విక్రయిస్తున్న వారిని అడిగే నాధుడు లేకపోవడంతో వారి చికెన్ అమ్మకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే స్థానిక అధికారులు నోటిసులు ఇచ్చిన పేపర్ ధరకే అమ్మకాలు కొనసాగించాలని చెప్పిన పెడ చెవిన పెట్టి చికెన్ వ్యాపారాలు సిండికేట్‌గా మారి వారికి నచ్చిన ధర నిర్ణయించుకొని అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

దేవాలయానికి సమీపంలో కనీస దూరం కూడా పాటించకుండా నిబంధనలకు నీళ్లు వదిలి వ్యాపారం చేస్తుంటే దేవాలయానికి దూరంగా వ్యాపారాలు నిర్వహించాలని అధికారులు నోటీసులు పంపించిన పెడచెవిన పెట్టి నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి వ్యాపారం చేస్తున్నారు. దీనిపై చుట్టుపక్కల వారు ఎన్నిసార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఖాళీ చేయించమని ఆదేశాల జారీ చేసిన పెడ చెవిన పెట్టి స్థానిక అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంలో వలనే వారికి మమ్మల్ని ఏమి చేయలేరు అనే ధీమా పెరిగింది. ఇంత జరిగిన పలుమార్లు పత్రికలో కథనాలు వస్తున్నా పర్యవేక్షణ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రజల నుండి సందేహాలు వెలువడుతున్నాయి.

నియంత్రించాల్సిన అధికారులే మామూళ్ల మత్తులో నిద్రపోవడం వలన చికెన్ వ్యాపారులు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇకనైనా అధికారుల మేల్కొని లైసెన్స్ లేని చికెన్ సెంటర్‌లోని సీజ్ చేసి చుట్టుప్రక్కల నివసిస్తున్న వారు అనారోగ్యాల భారిన పడకుండా చూసి దేవాలయం సమీపంలో ఉన్న చికెన్ దుకాణాలను ఖాళీ చేయించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News