Saturday, November 16, 2024

మోడీని ఎదర్కొనే మొనగాడు కెసిఆరే

- Advertisement -
- Advertisement -

మమతా బెనర్జీ కన్నా కెసిఆరే మంచి కమ్యూనికేటర్

మా మధ్య జాతీయ పార్టీ చర్చ జరగలేదు, సిఎం పక్కా ఎజెండా
త్వరలో అన్నీ ఆయనే చెబుతారు, మత వ్యతిరేక ముద్రపడితే దేశానికి నష్టం
మా భేటీలో ప్రశాంత్ కిశోర్ కూడా ఉన్నారు, కెసిఆర్ మళ్లీ ఎప్పుడు పిలిచినా
వెళ్తా రాజమండ్రిలో మీడియాతో మాజీ ఎంపి ఉండవల్లి వ్యాఖ్యలు

మన తెలంగాణ/హైదరాబాద్: భారతదేశంలో ప్రధాని నరేంద్రమోడీని ఎదుర్కొనే దమ్ము, శక్తి సామర్థాలు ఒక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకే ఉన్నాయని మాజీ ఎంపి ఉండవల్ల అరుణ్‌కుమార్ అన్నారు. ప్రస్తుతం మోడీ పాలన ప్రజాస్వామ్య బద్దంగా జరగడం లేదన్నారు. యదేశ్చగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో మోడీ నేతృత్వంలో సాగుతున్న బిజెపి పాలన ం దేశానికే ప్రమాదం ఏర్పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాన్ని ఎదుర్కొనాల్సిన ఆవశ్యకత బిజెపియేతర పార్టీలపై ఉందన్నారు. అయినప్పటికీ కొందరు బిజెపియేతర ముఖ్యమంత్రులు కేంద్రానికి భయపడుతున్నారన్నారు. మోడీని పలెత్తు మాట కూడా అనలేకపోతున్నారని విమర్శించారు. పొరపొటున ఎవరైనా నోరు మెదిపేతే వారిపై రకరకాల కేసులు పెడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మోడీపై దాదాపుగా కెసిఆర్ యుద్దం ప్రకటించారన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరముందన్నారు.
సోమవారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉండవల్లి అరుణ్‌కుమర్ మాట్లాడుతూ, సిఎం కెసిఆర్‌తో ప్రగతి భవన్‌లో జరిగిన చర్చల సారాంశాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు తెలిసి ప్రస్తుతం మోడీని రాజకీయంగా ఢీకొట్టే నైపుణ్యం ఒక్క కెసిఆర్‌లో కనిపిస్తోందన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా మాట్లాడుతున్నారన్నారు. అయితే ఆమె కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం అవుతున్నారన్నారు. కానీ కెసిఆర్ మాత్రం అలా కాకుండా……మొత్తం మోడీనే టార్గెట్‌గా చేసుకుని ఢిల్లీపై దండయాత్రకు బయలుదేరే ఉద్దేశ్యంతో ఉన్నారన్నారు. అయితే మీడియాలో కథనాలు వచ్చిన విధంగా తమ మధ్య (కెసిఆర్‌తో) జాతీయ పార్టీ గురించ చర్చ జరగలేదన్నారు. అలాగే ఆంధ్రరాష్ట్రానికి కెసిఆర్ ఏర్పాటు చేసే జాతీయ పార్టీకి ఇన్‌ఛార్జీ అన్న విషయంపై కూడా మాట్లాడుకోలేదన్నారు.
సిఎం కెసిఆర్ పది రోజుల క్రితం తనకు స్వయంగా ఫోన్ చేశారని ఉండవల్లి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒకసారి ప్రగతి భవన్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారన్నారు. ఆయనతో మాట్లాడి చాలా సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో కెసిఆర్ పిలుపుకు స్పందించి ప్రగతి భవన్‌కు వెళ్లాల్సి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రగతి భవన్‌లో కెసిఆర్‌తో కలిసి లంచ్ చేశానని అన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ అంశాలపై మాట్లాడామని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కెసిఆర్ తనకు చాలా గౌరవం ఇచ్చారన్నారు. కేంద్రంపై తాను చేస్తున్న విమర్శలను మరింత పెంచాలని తనకు సూచించారని ఉండవల్లి చెప్పారు. బిజెపికి చెక్ చెప్పకపోతే ఆ పార్టీకి ఉన్న 36 శాతం ఓటు బ్యాంకు పెరిగే ప్రమాదం ఉందన్నారు.
అయితే ఈ చర్చలో జాతీయ పార్టీ గురించి కెసిఆర్ ఎక్కడా తనతో మాట్లాడలేదన్నారు. కేవలం కేంద్రంలోని బిజెపి సర్కార్ పార్టీ అనుసరిస్తున్న తీరు… తెలంగాణ వంటి రాష్ట్రాలపై చూపుతున్న వివిక్ష తదితర అంశాలపై చర్చ జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్‌ను సరిగ్గా ఎదుర్కోని పక్షంలోరాబోయే రోజుల్లో ప్రమాదాలు తప్పవని కెసిఆర్‌తో తనతో చెప్పారని అరుణ్ కుమార్ పేర్కొన్నారు. మోడీ ప్రధాని అవటంలో ఎవరికి…ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే ఆయన అవలంభిస్తున్న విధానాలు ఏ మాత్రం బాగాలేవన్నారు. పైగా ఆ పార్టీలోని కొందరు నాయకులు ఇటీవల చేసిన వ్యాఖ్యలు అనేక దేశాల్లో మత విద్వేషాలకు కారణం అయ్యాయన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల మీద మనం ఆధారపడ్డామని అలాగే. మన దేశంపై కూడా ఇతర దేశాలు ఆధారపడ్డాయన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌దేశం ముస్లింలు, క్రైస్తవులకు వ్యతిరేకం అని ముద్ర పడితే చాలా నష్టపోతామని ఆయన వ్యాఖ్యానించారు. కానీ దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని ఉండవల్లి తేల్చిచెప్పారు. బిజెపి మత విధానాలకు పూర్తిగా నియంత్రించాల్సిన అవసరముందన్నారు.

కెసిఆర్‌కు చాలా క్లారిటీ ఉంది
జాతీయ రాజకీయాలపై సిఎం కెసిఆర్ చాలా క్లారిటీ ఉందని ఉండవల్లి పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న ప్రధాన సమస్యలపై ఆయనకు సంపూర్ణ అవగాహన కూడా ఉందన్నారు. ఏ రాష్ట్రంలో.. కేంద్రంతో ఎలాంటి సమస్యలు నెలకొన్నాయి….వాటిని పరిష్కరించుకునే విధానం వంటి అంశాలపై కూడా ఒక స్పష్టతతో ఉన్నట్లుగా కెసిఆర్ మాటలతో అర్థమైందన్నారు. ఇక రాష్ట్రాలపై మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న పెత్తనంపై కూడా కెసిఆర్ తీవ్రస్థాయిలో ఆక్షేపిస్తున్నారన్నారు. ఈ తరహాలోనే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చేయాలన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేగదన్నారు. దీంతో దేశంలో అసలు ప్రతిపక్షం ఉండొద్దనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం అక్రమంగా విపక్ష నేతలపై కేసులు పెడుతోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒక రకంగా వారి నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే ఆయన మీద గౌరవంతో పిలిచిన వెంటనే ప్రగతిభవన్‌కు వెళ్లానని ఉండవల్లి తెలిపారు. అనేక అంశాలపై కెసిఆర్ ఒక ఎజెండాతో సిద్దంగా ఉన్నారన్నారు. బిజెపికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని తనతో కెసిఆర్ చెప్పారన్నారు. సాగు, తాగునీటితో పాటు కరెంట్ తో పాటు ఇతర సమస్యలపై చాలా హోం వర్క్ చేశారన్నారు. వాటి గురించి కెసిఆర్ చెబుతుంటే తానే ఆశ్చర్యపోయానని ఉండవల్లి తెలిపారు.

అధికారంలో ఎవరున్నా బిజెపితో కలవాల్సిందే
ఎపిలో బిజెపి బలంగానే ఉందని.. రాష్ట్రంలో ఏ పార్టీ నెగ్గినా వారితో కలిసే ఉంటాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రం(ఎపి)లో బిజెపి వ్యతిరేకించే పరిస్థితి ఎవరికి లేదన్నారు. కేసులకు భయపడి చంద్రబాబునాయుడు నుంచి మొదలుకుని జగన్ వరకు అందరు మోడీకి సరెండర్ అయ్యారన్నారు. ఇక జనసేనా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా బిజెపికే మద్దతిస్తున్నారన్నారు. వీరు ఎవరు కేంద్ర ప్రభుత్వం మీద ఒక్క మాట మాట్లాడలేని దుస్థితి నెలకొందన్నారు. అందుకే రాష్ట్ర విభజన సందర్భంగా ఎపికి ఇచ్చిన హామీలన్నీ గాలిలో కొట్టుకపోయాయని ఉండవల్లి విమర్శించారు.

Undavalli Arun Kumar about KCR’s National Party

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News