Wednesday, January 22, 2025

కాసానితో ఎపి ఎంఎల్‌ఎ ఉండవల్లి శ్రీదేవి భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టిడిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి బుధవారం హైదరాబాద్‌లోని ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్‌ను కలిసి అభినందిస్తూ ఎమ్మెల్యే శ్రీదేవి తిరుమల తిరుపతి వెంకటేశ్వర్లు – పద్మావతి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని బహుకరించి శాలువాతో ఘనంగా సన్మానించారు. కాగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు, రెండు తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులు తదనంతర పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పార్టీకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ శ్రీదేవి సూచించారు. ఈ భేటీలో తెలంగాణ తెలుగు మహిళా అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహాక కార్యదర్శి మేకల భిక్షపతి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News