భారత క్రికెట్ అండర్-19 మాజీ కెప్టెన్ విజయ్ జోల్ ను మహారాష్ట్ర పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్ మెంట్ మేనేజర్ ఫిర్యాదు మేరకు విజయ్ జోల్‌తో పాటు అతని సోదరుడు విక్రమ్ జోల్ సహా 20 మందిపై కిడ్నాప్, దోపిడి, అల్లర్లకు పాల్పడ్డరన్న కేసులో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. అయితే తన కుమారుడిని క్రిప్టోకరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టగా, తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించారని విజయ్ తండ్రి భౌసాహెబ్ జోల్ ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనిపై జాల్నా పోలీస్ స్టేషన్‌కు చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆకాష్ షిండే మాట్లాడుతూ, ”ఇరువైపుల నుండి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మేము రెండు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసాము. మేము ఎఫ్‌ఐఆర్‌లలో పేర్కొన్న అన్ని క్లెయిమ్‌లు, ఆరోపణలను ధృవీకరిస్తున్నాము. తగిన చర్యలు తీసుకుంటాము.” అని ఆయన పేర్కొన్నారు.
టీమిండియా అండర్-19 మాజీ కెప్టెన్ అరెస్ట్
- Advertisement -
- Advertisement -
- Advertisement -