Sunday, December 22, 2024

అండర్‌19 వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ విడుదల..

- Advertisement -
- Advertisement -

2024లో జరగనున్న అండర్‌19 పురుషుల వన్డేవరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్ రివైజ్డ్‌ షెడ్యూల్‌ ను ఐసిసి విడుదల చేసింది. దక్షిణాఫ్రికా వేదికగా 15వ ఎడిషన్‌గా ఈ మెగా సమరం జరగనుంది. జనవరి 19న ప్రారంభమై.. ఫిబ్రవరి 11న జరిగే ఫైనల్ మ్యాచ్ తో ఈ ప్రపంచకప్ ముగుస్తుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్న భారత్‌.. తమ తొలి మ్యాచ్‌ను జనవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది.

ఈ ప్రపంచకప్ టోర్నీలో మొత్తం 16 జట్లు పోటీ పడనున్నాయి. ఈ జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌-ఏలో భారత్‌, బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌, యూఎస్‌ఎ జట్లు ఉన్నాయి. గ్రూప్‌-బిలో ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, స్కాట్లాండ్‌.. గ్రూప్‌-సిలో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, నమీబియాలు… గ్రూప్‌–డి లో న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, అఫ్గానిస్తాన్‌, నేపాల్‌ జట్లు ఉన్నాయి. ఈ ప్రపంచకప్ లో లీగ్ మ్యాచ్ లు ముగిసిన తర్వాత సూపర్‌ సిక్స్‌, గ్రూప్‌ స్టేజ్‌, సెమీ ఫైనల్స్‌, ఫైనల్‌ విధానంలో ఈ టోర్నీ జరుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News