- Advertisement -
మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్‌లో భారత్ బోణీ కొట్టింది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన తన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. విండీస్ పై తొమ్మింది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్..13.2 ఓవర్లకు 44 పరుగులకే ఆలౌటైంది. అసబి క్యాలెండర్ (12), కెనికా కాసర్ (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో పరుణికా సిసోదియా 3 వికెట్లు, జోషిత 2 వికెట్లు, ఆయుషి శుక్లా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 45 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 4.2 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి సునాయసంగా విజయాన్ని అందుకుంది.
- Advertisement -