Wednesday, January 22, 2025

పేకమేడలా కూలిన గంగా వంతెన

- Advertisement -
- Advertisement -

పాట్నా : బీహార్‌లో గంగానదిపై నిర్మించిన నాలుగు దారుల వంతెన ఆదివారం పేకమేడల కూలింది. భగల్పూరులో ఈ ఘటన సాయంత్రం పూట జరిగింది. ఈ ఏడాది ఈ వంతెన కూలడం ఇదే రెండోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రారంభించిన ఈ వంతెన సుల్తాన్‌గంజ్ , ఖల్గారియా జిల్లాలను కలుపుతుంది.

ఈ వంతెన ఉన్నట్లుండి పేకలాగా నదిలో పడిపోవడాన్ని గంగానది ఒడ్డున ఉన్న స్థానికులు తమ సెల్‌కెమెరాల్లో ఫోటోలుగా తీశారు. వంతెన కూలిన ఘటనలో ఎవరూ చనిపోలేదని అధికారులు ధృవీకరించారు. వంతెన పతనంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దర్యాప్తునకు ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News