Monday, January 20, 2025

నిర్మాణంలోని వంతెన కూలి ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

బీహార్ సుపౌల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఒక వంతెనలో కొంత భాగం శుక్రవారం తెల్లవారు జామున కూలిపోయినప్పుడు ఒక వ్యక్తి మరణించినట్లు, మరి తొమ్మిది మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. 10.2 కిలో మీటర్లు నిడివి ఉండే ఈ వంతెనను మధుబని జిల్లా భేజా, సుపౌల్ జిల్లా బకౌర్ మధ్య కోశీ నదిపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఎఐ) నిర్మిస్తోందని వారు తెలిపారు. ప్రమాదం తరువాత శిథిలాల కింద పది మంది కూలీలు చిక్కుకుపోయినట్లు

ఎన్‌హెచ్‌ఎఐ ప్రాంతీయ అధికారి వైబి సింగ్ తెలియజేశారు. ‘దురదృష్టవశాత్తు ఒక వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. తక్కిన తొమ్మిది మంది స్వల్ప గాయాలతో బయట పడ్డారు’ అని ఆయన తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు, బాధ్యులపై చర్య తీసుకోనున్నట్లు బీహార్ ఉప ముఖ్యమంత్రి, రోడ్డు నిర్మాణ శాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News