Saturday, January 11, 2025

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ రైల్వే స్టేషన్‌లో నిర్మాణంలో ఉన్న భారీ భవనం పైకప్పు శనివారం మధ్యాహ్నం ఒక్కసారి కుప్పకూలిపోవడంతో శిథిలాలకింద పలువురు చిక్కుకు పోయారు. 23 మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురిని వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. శిథిలాలు తొలగించి, అందరినీ రక్షించేందుకు సహాయ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ దుర్ఘటనపై నార్త్ ఈస్టర్న్ రైల్వే ముగ్గురు సభ్యుల ఉన్నతాధికారులతో దర్యాప్తునకు ఆదేశించింది. ఒకపక్క రైల్వే స్టేషన్‌లో జనం, మరో పక్క శిథిలాల కింద చిక్కుకున్న కూలీల హాహా కారాలతో స్టేషన్ దద్దరిల్లింది.

నిర్మాణంలో ఉన్న పైకప్పు కుప్పకూలిందని ప్రాధమిక విచారణలో తేలినట్లు కలెక్టర్ తెలిపారు. శిథిలాల కింద చిక్కుకు పోయిన వారిని కాపాడడమే తమ తక్షణ కర్తవ్యం అన్నారు. ఉన్నతాధికారులు సహాయక చర్యలను దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రెండున్నర లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ దళాలు సహాయ కార్యక్రమాల్లో తోడ్పడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News