Sunday, February 23, 2025

హిమాచల్ ప్రదేశ్ లో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనాలు.. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

సిమ్లా: కొండచరియలు విరిగిపడడంతో నిర్మాణంలో ఉన్న 10 వాణిజ్య భవనాలు కుప్పకూలిన ఘటన గురువారం ఉదయం హిమాచల్ ప్రదేశ్ కులూ జిల్లాలోని అన్ని మార్కెట్ సమీపంలోని బస్ స్టాండ్ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిర్మాణంలో ఉన్న ఈ భవనాలను ఇటీవల పరిశీలించిన జిల్లా ప్రభుత్వ యంత్రాంగం.. ఇక్కడ భవనాల నిర్మాణాలు సురక్షితంగా లేవని గుర్తించి, నిర్మాణాలను నిలిపేసింది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా, హిమాచల్ ప్రదేశ్ లో.. ముఖ్యంగా సిమ్లా, ధర్మశాల, మనాలి వంటి పర్యాటక ప్రాంతాలలో జరుగుతున్న భారీ నిర్మాణాలతో భౌగోలిక సమతుల్యతకు భంగం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News