Monday, January 27, 2025

కుప్పకూలిన చర్చి నిర్మాణ శ్లాబ్

- Advertisement -
- Advertisement -

ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

చికిత్స పొందుతూ ఒకరి మృతి…ఇద్దరి పరిస్థితి విషమం

జహీరాబాద్ : సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల కేంద్రంలో నూతన చర్చి నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తు సెంట్రింగ్ డబ్బా కూలిపోవడంతో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. భవన శిథిలాల కింద మరో నలుగురు కూలీలు చిక్కుకున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు అంతా ఉత్తరప్రదేశ్‌కు చెందినవారీగా పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఆర్‌డిఒ ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను స్థానికుల నుంచి అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News