Wednesday, January 22, 2025

రంగారెడ్డిలో విషాదం.. ఇండోర్ స్టేడియం కుప్పకూలి.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం కనకమామిడిలో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం గోడ ప్రమాదవశాత్తు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో మొత్తం 14మంది కూలీలు పనిచేస్తున్నట్లు సమాచారం. గోడ కూలడంతో భయంతో ఆడిటోరియంలో పనిచేస్తున్న కూలీలు బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ఘటనలో గాయపడిన మరో ముగ్గురు కూలీలను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.శిథిలాల క్రింద నుంచి ఒకరి మృతదేహాన్ని వెలికి తీశారు. మరో మృతదేహాన్ని బయటకు తీసేందుకు డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మృతులను బిహార్ కు చెందిన బబ్లూ, బెంగాల్ కు చెందిన సునీల్ లుగా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News