రాష్ట్రంలో ఉబికి వస్తోన్న భూగర్భ జలాలు.. 30లక్షలకు చేరిన బోరు బావులు
మన తెలంగాణ/హైదరాబాద్: జలసంరక్షణపై పూర్తిస్థాయి దృష్టిపెట్టిన బిఆర్‌ఎస్ ప్రభు త్వం కృషి ఫలిచింది. రాష్ట్రమంతటా పాతాల గంగమ్మ పైపైకి ఉబికి వస్తోంది. ఎగువ ప్రాంతాల్లో ఆశించనంతగా వర్షాలు లేకపోవటంతో ఈసారి కృష్ణానది ద్వారా రాష్ట్రానికి రావాల్సినంత వరద నీరు రాలేదు. కృష్ణాపైఉన్న ప్రా జెక్టులు నిండలేదు. అయినప్పటీకీ కృష్ణానదీ పరివాహకం గా ఉన్న ఆయకట్టులో భూగర్భ రైతుకు కొండంత అండగా నిలిచాయి. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కిం ద నీటి విడుదల లేకపోయినప్పటికీ రైతులు బోరు బావుల కింద ఖరీఫ్‌లో సాగు చేసిన పైర్లు కళకళలాడుతున్నాయి. రైతులు కృష్ణానదీజలాలపై ఆశలు పెట్టుకోకుండా భూగ ర్భ జలాల ఆధారంగానే వరి నాట్లు వేశారు. జూరాల, నెట్టెంపాడు, రాజీవ్‌భీమా, ఆర్డీఎస్, తుమ్మిళ్ల, కోయిల్‌సాగర్ , కల్వకుర్తి , ఎఎంఆర్పీ , దిండి మూసి, లంకసాగర్, వైరా తదితర కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల కింద కూడా రైతులు ఈ సారి భూగర్భజాలపైనే ఆ ధారపడి పంటలు సాగు చేశారు. గోదావరి నదీ పరివాహకంగా కూడా ఈసారి భూగర్భ జలమట్టాలు గణనీయగా వృద్ధి చెందాయి.
భూగర్భ జలవనరుల శాఖ అధికారుల సర్వేనివేదికల ప్రకారం రాష్ట్రంలో 680 టిఎంసీలకుపైగా భూగర్భజల వనరులు వ్యవసాయరంగానికి అందుబాటులో ఉన్నాయి. సన్న, చిన్న కారు రైతులు అత్యధికశాతం ఇప్పటికీ భూగర్భజలాల ఆధారంగానే పంటలు సాగు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ విద్యుత్‌రంగంలో చేసిన ప్రత్యేక కృషి వల్ల రాష్ట్రంలో 24గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతోంది. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుండటం వల్ల రాష్ట్రంలో బోరు బావుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.
తెలంగాణలో రాష్ట్రం ఏర్పడే నాటికి 21 లక్షలు ఉన్న వ్యవసాయ బోర్ల సంఖ్య నేడు 30లక్షలకు పెరిగింది. భూగర్భజలాలు అందుబాటులో ఉండటం, సాంకేతికంగా బోర్ల నిర్మాణం మరింత సులువు కావటంతో రైతులు ఖర్చుకు వెనకాడకుండా పంట పొలాల్లో బోర్లు వేయించుకునేందుకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చా రు. ప్రాజెక్టులు , పంట కాలువ ద్వారా వచ్చే సాగునీరు ఆయకట్టుకు అందే అవకాశాలు ఉన్నప్పటికీ, రైతులు ప్రత్యామ్నాయంగా భూగర్బ జలాలను కూడా అందుబాటులోకి తెచ్చుకుంటున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బోర్ల సంఖ్య అదనంగా మరో 9లక్షలకు పెరిగింది. రాష్ట్రంలో బోరు బావుల కింద సుమారు 60లక్షల ఎకరాలకలో వరితో పాటు మొక్కజొన్న తదితర పంటలు సాగు చేస్తున్నారు. ఒక్కో బోరు బావికింద ఎకరం నుంచి రెండు ఎకరాల వరకూ సాగు చేస్తున్న సన్న చిన్నకారు నైతులే అధికంగా ఉన్నారు.బోర్ల కింద ఆరుతడి పంటల సాగు కూడా పెరుగుతూ వస్తోంది.
చెరువులే బోర్లకు ఆదరువులు
ముఖ్యమంత్రి కేసిఆర్ మిషన్ కాకతీయ పథకం కింద చేపట్టిన చెరువుల పునరుద్ధరణ రాష్ట్రంలో భూగర్భ జలాల పెరుగుదలకు ఊపిరి పోసింది. రాష్ట్రంలో 46500 చెరువులను రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా దశల వారీగా పునరుద్ధరణ చేస్తూ వచ్చింది. చెరువుల్లో పూడిక మట్టిని తొలగించటం, చెరువు గట్లను పటిష్ట పరచటం, అలుగులను పునరుద్ధరించడం, వర్షాకాలం చెరువులకు నీటిని చేర్చే ఫీడర్ చానళ్లను ఆధునీకరించడం , వాగులు, వంకలపైన చెక్‌డ్యాంలు నిర్మించడం తదితర పనుల వల్ల రాష్ట్రంలో మండు వేసవిలోనూ చెరువులు నిండుకుండలను తలిపించే పరిస్థితులు ఏర్పడ్డాయి. చెరువుల్లో చేరుతున్న నీటి వల్ల భూగర్భజలం కూడా వృద్ధి చెందింది. చెరువుల పరిసర ప్రాంతాల్లో బోరు బావులకు పుష్కలంగా నీరందుతుంది. మిషన్ కాకతీయకు ముందు వందల అడుగుల్లోతులోకెళ్లి శోధించించినా శోకమే తప్ప నీటి జాడ కనిపించక బోర్ల తవ్వకం కోసం చేసిన వ్యయం వృధా పోయేది. అప్పులపాలై ఆస్తులు అమ్ముకుని రోడ్డున పడ్డ రైతుకుంటుంబాలేన్నో ఉన్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న జల సంరక్షణ చర్యలతో రాష్ట్రంలో సగటున 10 మీటర్లలోనే భూగర్భ జలం అందుబాటులోకి వచ్చింది. రైతులకు కూడా బోర్ల ద్వారా పంటలు సాగు చేస్తే సాగు నీటి సమస్య నమ్మకంగా పంటలు చేతికందుతాయన్న భరోసా పెరిగిపోయింది.