Sunday, December 22, 2024

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ. 63కోట్లు సీజ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఇప్పటి వరకు రూ.63 కోట్లను సీజ్ చేశారు. ఎన్నికల ప్రకటన వెలువడగానే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కమిషనరేట్ పరిధిలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. వాటితోపాటు వివిధ ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో పోలీసులు భారీ ఎత్తున నగదు పట్టుకున్నారు.

నగదును తరలిస్తున్న వారు వాటికి సంబంధించిన ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. కేసులు నమోదు చేసి ఇన్‌కం ట్యాక్స్ అధికారులకు అప్పగించారు. అలాగే సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో కూడా వాహనాలను తనిఖీ చేసి నగదును పట్టుకున్నారు. ఎన్నికల్లో అక్రమ నగదు పంపిణీ జరగకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. పలు ప్రాంతాల్లో తరలిస్తున్న హవాలా నగదును కూడా సీజ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News