Wednesday, January 22, 2025

వర్షానికి కూలిన అండర్ రైల్వే బ్రిడ్జి గోడ

- Advertisement -
- Advertisement -

చేగుంట: రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ జిల్లా చేగుంట మండలంలోని వడియారం నుండి రామంతపురం తండా వెళ్ళే దారిలో ఉన్న రైల్వే అండర్ పాస్ కు ఉన్న గోడ కూలింది. రాత్రి సమయంలో కూలండంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. నిత్యం రామంతపురం తండాను నుండి వందలాది మంది తండా వాసులు, రైతులు వస్తూ పోతుంటారు. నాసి రకం కట్టడం వల్లనే ఈ విదంగా గోడ కూలిందని ప్రజలు,తండా వాసులు ఆరోపిస్తున్నారు. అటు తెలంగాణ వ్యాప్తంగా గత మూడ్రోజులుగా వర్షాలు జోరందుకున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News