Wednesday, January 22, 2025

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అమెరికా, ఫ్లోరిడా రాష్ట్రంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా ఆధ్వర్యంలో బోనాలు ఘనంగా జరిగాయి. తంపా, ఫ్లోరిడాలో తెలంగాణ నుంచి వచ్చి స్థిరపడిన ఎన్‌ఆర్‌ఐలు భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకున్నారు. దాదాపుగా 700ల మంది ఈ బోనాల్లో పాల్గొన్నట్టు టిజిఎఫ్‌ఎల్ సంఘం తెలిపింది. ఇక నుంచి ప్రతి యేటా బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటామని టిజిఎఫ్‌ఎల్ సభ్యులు తెలిపారు. ఈ బోనాల వేడుకులకు విచ్చేసిన భక్తులకు రుచికరమైన తెలంగాణ వంటకాలతో విందును ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా (టిజిఎఫ్‌ఎల్) చైర్మన్ చందు తల్లా, వైస్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్, మోహిత్ కర్పూరం, ప్రెసిడెంట్ అనిల్ బంధరం , వైస్ ప్రెసి డెంట్ వెంకట్ కంచర్ల , మహేష్ అడపా ,ఆశ్రీన్ రెడ్డి , శివరాజ్ ఓడపల్లి , శ్రవణ్ మొగుడం పల్లి, లతారెడ్డి, స్వాతి తక్కళ్లపల్లి , లింగారెడ్డి, జనార్దన్, సత్య గుజ్జ, నారాయణ చీరాల, రవి వుమ్మగోని, వనం వెంకటేశ్వరరెడ్డి, ఉదయ్ బస్వోజు, ఆశిష్ గట్టు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News