Monday, December 23, 2024

సిఎం కెసిఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

ఆత్మకూరు: తెలంగాణ రైతులకు 24 గంటలు విద్యుత్ ఇచ్చే కెసిఆర్ కావాలన్నా మూడు గంటలు కరెంటు చాలు అనే ఒక బ్రోకర్ కావాలా అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, పునాదుల్లోనే నిలిచిపోయిన మహిళా కమ్యూనిటీ భవనం, అంతర్గత సీసీ రోడ్లను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ సాహోరే కమల రాజేశ్వర్‌రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ జరిగినా అభివృద్ధి పరకాల నియోజకవర్గంలో జరిగిందని, కోట్లాది రూపాయల నిధులు తెచ్చి మహిళలకు మహిళా భవనాలు, నూతన గ్రామపంచాయతీలు, అన్ని అంతర్గత రోడ్లు వేశామన్నారు.

అభివృద్ధిని చూసి ఓర్వలేని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. వాటిని తిప్పి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్సార్ హయాంలో ప్రజలకు రూ. 200 పింఛన్లు ఇచ్చారని సీఎం కేసీఆర్ వృద్ధులు, వికలాంగులందరికీ గృహాలను అందించారన్నారు. గృహలక్ష్మి పథకంలో గృహాలను మంజూరుచేస్తున్నామన్నారు.

ఈ సమావేశంలో ఎంపీపీ మార్కర్ సుమలత రజనీకర్‌గౌడ్, జడ్పీటీసీ కక్కెర్ల రాధిక రాజుగౌడ్, స్థానిక సర్పంచ్ సావరె కమల రాజేశ్వర్‌రావు, ఉపసర్పంచ్ కక్కెర్ల వనమాల సుధాకర్‌గౌడ్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఎనకతాళ్ల రవీందర్, పెద్దాపురం సొసైటీ వైస్ ఛైర్మన్ అంబటి రాజస్వామి, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు లేతాకుల సంజీవరెడ్డి, బొల్లోజు కుమారస్వామి, ఆత్మకూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ బొల్లబోయిన రాధ రవియాదవ్, సర్పంచుల ఫోరం రాష్ట్ర నాయకుడు మచ్చిక యాదగిరిగౌడ్, ఎనకతల్లా విజయ అంశాల్‌రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు వంశీగౌడ్,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News