యాదాద్రి భువనగిరి :సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాలకు ప్రత్యేక శోభ సంతరించుకుందని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని భువనగిరి జిల్లా కేంద్రంలోని పచ్చలకట్ట సోమలింగేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన వేడుకలలో ముఖ్య అతిథులుగా భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
వారికి ఆలయ అర్చకులు నిర్వాహాకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితుల ఆశీర్వాదంతో స్వామివారిని దర్శించుకొని ప్ర త్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయంలో పనిచేసే అర్చకులకు గౌరవ వేతనం అందించడంతో పాటు, వాటి అభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక నిధులు మంజూరు చేస్తున్నారని, దేవుళ్ల కృప కటాక్షాలు ముఖ్యమంత్రి కెసిఆర్‌పై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఆలయాలకు ప్రత్యేక శోభ సంతరించుకున్నదని గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాలకు ఎటువంటి నిధులు కేటాయించకపోవడంలో అభివృద్ధికి నోచుకోలేదని, నేటి ముఖ్యమంత్రి సహకారాలతో దేశంలోని పలు ఆలయాలకు తలమానికంగా యాదాద్రి నిర్మాణం చేసుకొని రాష్ట్రంలో ఉ న్న ప్రముఖ ఆలయాలకు నిధులు కేటాయించుకొని అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. ఆలయాలకు దూప దీప నై వేద్యం క్రింద నిధులు కేటాయించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని గతంలో 6వేలు కేటాయించిన నిధులు ఆలయ అవసరాలకు సరిపోతలేవనే సదుద్దేశ్యంతో ముఖ్యమంత్రి ఇటీవలే పదివేలను ఖరారు చేశారన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా మండల ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.