Friday, January 24, 2025

ముఖ్యమంత్రి పాలనలో వైద్య రంగానికి పెద్దపీట

- Advertisement -
- Advertisement -

మణుగూరు : సిఎం కెసిఆర్ పాలనలో వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. మణుగూరు మండలంలోని స్నేహ గార్డెన్స్ నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. తొలుత అధికారులు, చిన్నారులు వారికి పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

వైద్య ఆరోగ్య శాఖ సాధించిన విజయాలను ఎల్‌ఈడి స్క్రీన్‌పైన వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రంలో సర్కార్ వైద్యంపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఏర్పడిందన్నారు. ఏ రోగమెచ్చినా ఆధునాతక చికిత్స దొరుకుతుందనే భరోసా కలిగిందని తెలిపారు. సిఎం కెసిఆర్ పగ్గాలు చేపట్టాక వైద్య రంగాన్ని బలోపేతం చేశారని, మౌలిక సదుపాయల కల్పనకు పెద్దపీట వేయటంతో పాబొ ప్రభుత్వ దావఖానాలలో రూ రేఖలు మార్చేశారని అన్నారు.

సకల సౌకర్యాలు కల్పించి కార్పొరేట్ స్థాయిలో ఆధునాతక వైద్య చికిత్సలు అందుబాటులోకి తీసుకువచ్చారని, పేదల సంక్షేమం కోసం వినూత్న పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. డయాలసిస్, డయాగ్నోస్టిక్స్ సెంటర్‌లో కెసిఆర్ కిట్లు అమ్మ ఒడి వంటి కార్యక్రమాలు ప్రారంభించారని, ఫలింగా దవాఖానాలపై ప్రజలకు నమ్మకం కలిగిందన్నారు. సమైక్య పాలనలో నేను రాను బిడ్డ సర్కార్ దవాఖానాకు అని పాడుకున్న జనం నేడు దవాఖానాలకు జై కొడుతున్నారన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయని, ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు. మెడికల్ నర్సింగ్ కళాశాల ఏర్పాటుతో పాటు జిల్లా ఆస్పత్రి వైద్య విధాన పరిషత్, నర్సింగ్ కళాశాల ఏర్పాటుతో పాటు జిల్లా ఆసుపత్రి వైద్య విధాన పరిషత్ వైద్య కళాశాల ఆసుపత్రులలో సేవలు చేరువ అయ్యాయన్నారు. ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News