Sunday, December 22, 2024

నా ప్రాణానికి ముప్పు ఉంది: ఇమ్రాన్ ఖాన్

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: తన ఈ పరిస్థితికి సైన్యం, ఐఎస్‌ఐ కారణమని, తన ప్రాణానికి ముప్పు ఉందని జైలు జీవితాన్ని గడుపుతున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంగళవారం పునరుద్ఘాటించారు. ఏడాది కాలంగా అడియాలా జైలులో గడుపుతున్న 71 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఒక లేఖను పోస్టు చేశారు.

విమర్శలను సహించలేకపోతున్న ప్రస్తుత పాక్ పాలకులు దేశ్యాప్తంగా క్షీణిస్తున్న శాంతి భద్రతలకు, వరుస ఓటములను చవిచూస్తున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు నాశనానికి బాధ్యత వహించాలని డిమాండు చేశారు. తన ఖైదుకు సంబంధించిన అన్ని పాలనాపరమైన వ్యవహారాలను ఎఎస్‌ఐ గుప్పిట్లో పెట్టుకుందని, తనకేమైనా జరిగితే అందుకు సైన్యాధిపతి, ఐఎఎస్‌ఐ డిజి బాధ్యులని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News