Monday, December 23, 2024

మెడికోల ర్యాగింగ్.. విద్యార్థినిగా లేడీ పోలీస్ మారువేషం

- Advertisement -
- Advertisement -

ఇండోర్: సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా నేరస్థులను పట్టుకునేందుకు పోలీసులు మారువేషాలు వేస్తుంటారని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌కు పాల్పడిన మెడివైద్య విద్యార్థులు కొందరిని పట్టుకునేందుకు ఒక మహిళా పోలీసు అధికారి మూడు నెలల పాటు మెడికో అవతారం ఎత్తారు. ఆమెతోపాటు మరో మహిళా కానిస్టేబుల్ నర్సుగా, ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు క్యాంటిన్ కార్మికులుగా మూడు నెలలపాటు నిఘా పెట్టి ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులను గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోగల మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజ్‌లో ఈ సంఘటన ఇటీవల జరిగింది. తమ వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరుగుతున్నట్లు కొందరు విద్యార్థులు యుజికికి ఫిర్యాదు చేశారు. దీంతో కళాశాల యాజమాన్యం కొందరు గుర్తు తెలియని విద్యార్థులపై ప్రోలీసు స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేసింది. ర్యాగింగ్‌కు పాల్పడుతున్న ఆ గుర్తు తెలియని విద్యార్థులెవరో ఆచూకీ కనిపెట్టేందుకు ఒక మహిళా పోలీసు అధికారి కళాశాలకు వెళ్లారు. మూడు నెలల పాటు ఆమె మెడికల్ విద్యార్థిగా ఆ పరిసరాలలోనే తిరిగి నిందితులను గుర్తించడంలో సఫలీకృతం అయ్యారు. ఆమెతోపాటు మరో మహిళా కానిసేబుల్ నర్సుగా, ఇద్దరు పురుష కానిస్టేబుల్స్ క్యాంటీన్ కార్మికులుగా ఈ కేసును ఛేదించడానికి రంగంలోకి దిగారు.

ఈ కేసులో 11 మంది విద్యార్థులను నిందితులుగా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూనియర్ విద్యార్థులతో అత్యంత ఘోరంగా అశ్లీల చేష్టలు చేయించడంతోపాటు వారిని తీవ్రంగా వేధించిన 11 మంది విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామ నిసంయోగితాగంజ్ పోలీసు స్టేషన్ ఇన్‌చార్జ్ తెహజీబ్ ఖాజీ తెలిపారు. ర్యాగింగ్‌కు పాల్పడిన 11 మంది విద్యార్థులను మూడు నెలలపాటు కళాశాల యాజమ్యాం సస్సెండ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News