- Advertisement -
హైదరాబాద్: నగరంలో మొట్టమొదటిసారిగా అండర్ గ్రౌండ్ మెట్రో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. రెండో దశలో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కి.మీ. మెట్రో కారిడార్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.
దీనిలో భాగంగా విమానాశ్రయం సమీపంలో 2.5కి.మీ. అండర్ గ్రౌండ్ మెట్రో నిర్మించనున్నట్లు చెప్పారు. మెట్రో రెండో దశ నిర్మాణానికి డిసెంబర్ 9వ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేయనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.
Underground Metro Corridor near to Shamshabad Airport
- Advertisement -