పూర్తిగా తీరనున్న ట్రాఫిక్ సమస్య
మన తెలంగాణ/సిటీ బ్యూరో : నగరంలోని నెలకొ న్న పద్మవ్యూహాం లాంటి ట్రాఫిక్ సమస్యకు పూర్తిగా చెక్ పెట్టేందుకు గాను గ్రేటర్‌లోని రోడ్ల వ్యవస్థను మ రింత మెరుగుపర్చడంపై జిహెచ్‌ఎంసి పూర్తి స్థాయి దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఎస్‌ఆర్‌డిపి( వ్యూహాత్మక రహదారుల అభివృద్ధ్ది ప్రాజెక్టు) మొదటి దశ కింద ఇప్పటీకే గ్రేటర్ వ్యాప్తంగా పలు ప్లైఓవ ర్లు, అండర్‌పాసులు, జంక్షన్ల అభివృద్ధ్ది పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడమే కాకుండా పలు ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకురావడం ద్వా రా ట్రాఫిక్ సమస్యను కొంత మేర పరిష్కారించారు.
ఎల్‌బినగర్ చౌరస్తా నలువైపుల
ట్రాఫిక్ సమస్యకు చెక్
ఇందులో భాగంగా నగరంలోని ఎల్‌బినగర్ చౌరస్తా అత్యంత ప్రధానమైంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లేందుకు ఎల్‌బినగర్ మార్గం అత్యంత ప్రధానమైనది కావడమే కాకుండా నల్లొండ ఇటు నాగార్జున సాగర్ తో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం, కర్నూలు వైపు సైతం ఇదే మార్గంగుండా వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఎల్‌బినగర్ ప్రాంతంలో ఇప్పటీకే పలు ప్లైఓవర్లుతో పాటు అండర్ పాస్‌మార్గాలను చేపట్టడమే కాకుండా ఇందులో భైరామల్ గూడ ఓక వైపు ప్లైఓవర్ తప్పిస్తే దాదాపుగా అన్ని ప్రాజెక్టు పనులు పూర్తయ్యా యి. ఇందులో ఒక అండర్ పాస్ మార్గం తప్పించి అన్ని ప్రజలకు ఇప్పటీకే అందుబాటులోకి తీసుకువ చ్చారు. అయితే మిగిలిన మరో అండర్ పాస్ రోడ్డు మార్గం పనులు సైతం పూర్తి కావడంతో ఫిబ్రవరి చివ రి వారం నాటికి అందుబాటులోకి తీసుకు వచ్చేందు కు అధికారులు అంతా సిద్దం చేస్తున్నారు.
రూ. 14.87 కోట్ల వ్యయంతో
మరోఅండర్ పాస్ మార్గం అందుబాటు
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆరంఘర్, మిథాని మీదుగా వచ్చే ట్రాఫిక్ ఇబ్బందు లు లేకుండా ఎల్‌బినగర్ చౌరస్తా వద్ద రూ. 14.87 కోట్ల వ్యయంతో (RHS) కుడివైపు అండర్ పాస్ మా ర్గం చేపట్టారు. మొత్తం 490 మీటర్ల పొడవు గల అం డర్ పాస్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోవడం తో ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. ఈ అండర్ పాస్ 12.875 మీటర్ల వెడల్పు 7250 మీటర్ల బాక్స్ పోర్షన్ 3 లైన్‌ల యూని డైరెక్షన్ లో చేపట్టారు. సికింద్రాబాద్ రెటైనింగ్ బైరమల్ గూడ రిటైనింగ్ వైపు వాల్ లు నిర్మాణాలు అండర్ పాస్ నిర్మాణం వలన సిగ్నల్ ఫ్రీ రహదారిగా ఉప్పల్ నుండి మిధాని వరకు ట్రాఫిక్ సమస్య లేకుండా వెళ్లవచ్చు. దీని వలన వాహనాలు సాఫీగా ముందకు సాగనుండడంతో కాలుష్యం చాల మేరకు తగ్గనుంది. ఆరాంఘర్ నుండి ఎల్‌బినగర్ వరకు వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుం డా నేరుగా వెళ్లేందుకు వీలుగా ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపట్టగా ఓవైసీ జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ ప్రార ంభం కాగా బహద్దూర్ పుర ఫ్లైఓవర్ మార్చిలో ప్రారంభించేందుకు ఎస్‌ఆర్‌డిపి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎల్‌బినగర్ అండర్ పాస్ తో పాటుగా తుకా రాం గేట్ రైల్వే అండర్ పాస్ కూడా ఫిబ్రవరి మాసం లో అందుబాటులోకి తేనున్నారు.