Thursday, January 23, 2025

ఉక్రెయిన్‌పై భారత్ వైఖరిని అర్థం చేసుకుంటున్నాం: స్కాట్ మారిసన్

- Advertisement -
- Advertisement -

Modi and Shringla
న్యూఢిల్లీ: ‘ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో భారత వైఖరిని అర్థం చేసుకుంటున్నాం’అని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ సోమవారం అన్నారు. ఇండోపసిఫిక్ అంశం నుంచి ఆ ఘర్షణ దృష్టి మరల్చడానికి వీలులేదని ఆయన, ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారని విదేశాంగ కార్యదర్శి హర్ష వర్ధన్ ష్రింగ్లా తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి అన్న అంశం ఇరు దేశాల ప్రధానుల చర్చ మధ్య చోటుచేసుకుందని పిటిఐ వార్తా సంస్థ తెలిపింది. భారత, ఆస్ట్రేలియా ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ తొలి సమావేశం కొవిడ్-19 వేవ్ తర్వాత ఇదే మొదటిసారి. ఉక్రెయిన్‌లోని పరిస్థితిపై ఆందోళనకరంగా ఉన్నప్పటికీ భారత వైఖరిని అర్థం చేసుకుంటున్నాం అని ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ చెప్పారు. ఉక్రెయిన్‌లో హింస, ద్వేషం, శత్రుభావన నశించాల్సి ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఉక్రెయిన్ పరిస్థితి – ఇండోపసిఫిక్, మయాన్మార్ అంశాలపై దాని ప్రభావం, ప్రాంతీయ అంశాలు, తదితర అంశాలపై మేము చర్చించనున్నాం’ అని ఆస్ట్రేలియా ప్రధాని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తూర్పు లడఖ్ పరిస్థితిని  మోడీ ప్రస్తావించారని ఆయన తెలిపారు. చైనాతో భారత సంబంధాల సాధారణీకరణకు ఈ ప్రాంతంలో ప్రశాంతత అవసరం అని కూడా అన్నారు. భారత, ఆస్ట్రేలియాల సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం కూడా ఫైనలైజ్ చేయనున్నామని  తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడిని విస్తరించాలనుకుంటున్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News