Thursday, January 23, 2025

వరిలో తడి పొడి సాగు విధానంపై అవగాహన

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: కోర్‌కార్బన్ ఎక్స్ సొల్యూషన్స్ హైదరాబాద్ వారి సహాకారంతో పద్మసాని స్వచ్చంద సంస్థ కామారెడ్డి ఆద్వర్యంలో శనివారం చిన్న మల్లారెడ్డి గ్రామంలో రైతు వ్యవసాయ క్షేత్రంలో వరిలో నీటిగొట్టం ఉపయోటించి తడి పొడి విధానం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పద్మసాని స్వచ్చంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ అమృత రాజెందర్ విదానంపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు.

తడిపొడి విధానం అమలు చేస్తున్న పద్దతి ద్వారా అధిక పిలకలు రావడం, దోమపోటు ఉదృతి దగ్గిందన్నారు. అలాగే నీటి వినియోగం తగ్గుతుందని చెప్పారు. దీంతో నీటి పొదుపు, నీటి వినియోగం, తెగుళ్ల నివారణ, దోమపోటు నివారణ, వరిలో మిథేన్ వావుయు తగ్గింపు వరిలో తడి పొడి విదానంతో గాలి వెలుతురు, వేర్లకు ఆక్సిజన్ అందడం వల్ల దృఢమైన వేరు వ్యవస్థ, అధిక పిలకలు రావడం లాంటి ఉపయోగాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ అమృత రాజెందర్, క్లస్టర్ కో ఆర్డినేటర్ రజిత, గ్రామ కోఆర్డినేటర్ రవి రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News