Monday, December 23, 2024

పుస్తకాలతో కుస్తీ

- Advertisement -
- Advertisement -

Unemployed are getting ready for competitive exams

నగరంలో నిరుద్యోగ యువత,
విద్యార్థుల హడావుడి
ఒక్కొక్కటిగా వెలువడుతున్న
ఉద్యోగ నోటిఫికేషన్లు
పాఠ్య పుస్తకాలు తిరగేస్తూ జోరుగా
అభ్యర్థులు ప్రిపరేషన్
కిటకిటలాడుతున్న గ్రంథాలయాలు,
కోచింగ్ సెంటర్లు

ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నగరంలోని నిరుద్యోగులు పోటీ పరీక్షలకు కుస్తీపడుతున్నారు. నోటిఫికేషన్ల జారీకి ఇంకా సమయం ఉన్నా…ఒక్కొక్కటిగా విడుదలు చేస్తుండటంతో స్టడీమెటీ రియల్ బుక్స్ సేకరించడంతో పాటుగా వివిధ రకాల ఉద్యోగాలకు సిద్దమైతున్నారు. కోచింగ్ కేంద్రాలకు అందుబాటులో ఉన్నారు వెళ్తుండగా మిగతావారు స్వతహాగా ప్రిపేర్ అవుతూనే గ్రంథాలయాలకు వెళ్లు తున్నారు. గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు, కానిస్టే బుల్ నుంచి ఎస్సై వరకు ఫార్మాసిస్టు నుంచి డాక్టర్ పోస్టుల వరకు నోటిఫికేషన్లు వెలువడుతుండటంతో పుస్తకాలు చేతపడుతున్నారు. మరోవైపు కోచింగ్ సెంటర్‌లలో కోచింగ్ తీసుకునే స్థ్దోమ తలేని వారికి శిక్షణ ఇచ్చేందుకు పలు స్వచ్చంద సంస్దలు ముందుకు వస్తున్నాయి.

హైదరాబాద్: పలు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యీలు, అధికార పార్టీలకు చెందిన నాయకులు ఉచిత శిక్షణ పొందేవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వీరికి ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించి వారికి ఉత్తమమైన అధ్యాపకుల తో శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాట్లు వేగం చేస్తున్నారు. ప్రభుత్వం కొత్త జోన్ల ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాలకు అనుగుణంగా జోన్‌లను ఏర్పాటు చేసి ఖాళీలను ప్రకటించింది. ఒకేసారి భారీగా పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో 80,039 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించిన సిఎం కెసిఆర్ వాటిని విడుదల వారిగా భర్తీ చేసేందు కు ప్లాన్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇటీవలే గ్రూప్ 1, పోలీసు,వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన 30, 453 పోస్టులకు ఆర్దికశాఖ అనుమతి ఇచ్చి, టిపిఎస్సీతో పాటు వివిధ బోర్డుల కింద ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వీటికి సంబందించి కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్లు దశగా విడుదల చేయనున్నట్లు పేర్కొంటున్నారు.

కోచింగ్ సెంటర్లకు కాసుల పంట:  ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ మొదటి విడుత విడుదల కావడంతో గత ఐ దారు రోజుల నుంచి నగరంలోని పలు కోచింగ్ సెంటర్లు నిరుద్యోగ అభ్యర్థులతో కిటకిటలాడుతున్నాయి. గ్రూపు 1కు రూ. 75వేలు, పోలీసు శిక్షణకు రూ. 25వేలు తీసుకుని రోజుకు మూడు నుంచి ఐదు గంటల పాటు తరగతులు నిర్వహిస్తూ ముందుగా ఫీజు చెల్లించినవారికే మెటీరియల్, తరగతులకు పంపిస్తామని పేర్కొనంటూ దర్జాగా దనం సంపాదించుకుంటున్నారు. కోచింగ్ సెంటర్ల అడ్డగోలు ఫీజులపై విద్యార్థిసంఘాల నాయకులు మండిపడుతున్నారు. ప్రభుత్వం అధికారులు ప్రైవేటు కోచింగ్ సెంటర్ల దోపిడీకి అడ్డుకట్టవేయాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News