Sunday, December 22, 2024

నిరుద్యోగ నిరసనల్లో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : నిరుద్యోగుల సెక్రటేరియట్ ముట్టడి సందర్భంగా సోమవారం రాష్ట్ర సచివాల యం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బిసి జనసభ కార్యకర్తలు సచివాలయంలోకి చొ చ్చుకెల్లేందుకు ప్రయత్నించారు. ఈ క్ర మంలో నిరుద్యోగలు, జనసభ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట చో టుచేసుకున్నది. సచివాలయంలోకి వె ళ్లేందుకు ప్రయత్నించిన బిసి జనసభ కార్యకర్తలను పోలీసులు పట్టుకున్నా రు. జనసభ అధ్యక్షుడు రాజారాం యా దవ్ సహా కార్యకర్తలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. డిఎస్‌సి ప రీక్షను వాయిదా వేయాలని ఈ సందర్భంగా రాజారాం యాదవ్ డిమాండ్ చేశారు.

డిఎస్‌సిని వాయిదావేయకపోతే సిఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.కాగా, కాంగ్రె స్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మే రకు ఏటా రెండు లక్షల ఉద్యోగాల భ ర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల, మెగా డి ఎస్‌సి నోటిఫికేషన్, గ్రూప్ 2, 3 పోస్టు ల పెంపు, డిఎస్‌సి పరీక్షల వాయిదా, గ్రూప్- 1 మెయిన్స్‌కు 1:100 పద్ధతిలో అభ్యర్థులను
పిలవాలనే డిమాండ్లతో నిరుద్యోగులు, ఉద్యోగార్ధులు రాష్ట్ర సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలిరానున్న నేపథ్యంలో సచివాలయం వద్ద భారీగా పోలీసులును మోహరించారు. బారికేడ్లు, ఇనుపకంచెలు, వాటర్ క్యానన్లను ఏర్పాటు చేశారు.

చిక్కడపల్లి లైబ్రరీ వద్ద ఉద్రిక్తత..
నగనరంలో చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయం వద్ద ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. నిరుద్యోగ సంఘాల పిలుపు మేరకు సోమవారం సాయంత్రం నుంచే గ్రంథాలయానికి భారీగా గ్రూప్స్, డిఎస్‌సి పరీక్ష అభ్యర్థులు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. గ్రూప్ 2, 3, డిఎస్‌సి వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. అయితే అప్పటికే భారీగా పోలీసులు బలగాలు లైబ్రరీ వద్దకు చేరుకున్నాయి. చిక్కడపల్లి లైబ్రరీ నుంచి ర్యాలీగా బయలుదేరేందుకు నిరుద్యోగుల ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు.

అరెస్ట్ చేసిన నాయకులను బేషరతుగా విడుదల చేయాలి : కెటిఆర్
నిరుద్యోగ యువకులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దుర్మార్గ పూరితంగా వ్యవహరిస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. వారి సమస్యలను సానుకూలం థృక్పథంతో నెరవేర్చాల్సింది పోయి నిర్భంధం పెడతూ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల డిమాండ్ల కోసం సెక్రటేరియేట్ ముట్టడికి ప్రయత్నించిన రాజారాం యాదవ్ సహా ఇతర విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయటాన్ని కెటిఆర్ ఖండించారు. రాజారాం యాదవ్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన రాజారాం యాదవ్ సహా మిగతా విద్యార్థి నాయకులందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

నిరుద్యోగులపై పాశవికంగా ప్రవర్తించడం దుర్మార్గం : హరీశ్‌రావు
చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు పేర్కొన్నారు. గ్రూప్స్, డిఎస్‌సి అభ్యర్థులు, నిరుద్యోగులపై ప్రభుత్వం ఇంత పాశవికంగా ప్రవర్తించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇదేనా ప్రజా పాలన అంటే, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే..? అని ప్రశ్నించారు. నాడు సిటీ సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీని తీసుకువెళ్లి ఓట్లు కొల్లగొట్టారు..నేడు అదే లైబ్రరీకి పోలీసులను పంపించి విద్యార్థుల వీపులు పగలగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై జరుగుతున్న దమనకాండను ప్రభుత్వం వెంటనే ఆపాలని, ఈ ఘటనకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News