Saturday, October 5, 2024

1:100 అమలు చేయాల్సిందే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఉద్యోగాల భర్తీలో ప్రభు త్వం తన మెుండివైఖరి వీడాలంటూ పలు విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతలు రోడెక్కి ఆందోళన చేపట్టారు. గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల భర్తీలో పోస్టులను పెం చాలని, గ్రూప్- 1మెయిన్స్ 1:100 నిష్పత్తి అమలు చే యాలని, జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలన్న తదితర డిమాండ్లపై పలు విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు టిజిపిఎస్‌సి ముట్టడికి పిలుపునిచ్చాయి.

నిరుద్యోగ సంఘాలు ఇచ్చిన మార్చ్‌ను దృష్టిలో పెట్టుకొని, హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టిజిపిఎస్‌సి కార్యాలయం వద్ద బిఆర్‌ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం బిఆర్‌ఎస్‌వి ఆందోళన నిర్వహించింది. డిఎస్‌సిని మూడు నెలలపాటు వాయిదా వేయాలని, అక్టోబర్‌లో 25 వేల పోస్టులతో మెగా డిఎస్‌సి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ టిజిపిఎస్‌సి కార్యాలయం వద్ద రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న విద్యార్థి, నిరుద్యోగ సంఘా ల నాయకులను అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు.

ఇచ్చిన హామీ నిలబెట్టుకోమంటే ఇంత నిర్బంధమా?: కెటిఆర్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి యువతపై ప్రేమ లేదని, నిరుద్యోగులు అంటే అసలే గౌరవం లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆక్షేపించారు. నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసిన నయవంచక సర్కా రు ఇది అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమంటే ఇంత నిర్బంధమా..? అని ప్రశ్నించారు. తెల్ల దొరల పాలన కన్నా, దుర్మార్గంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఓ వైపు ప్రజా పాలన అంటారు. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి యువతను అక్రమంగా అరెస్టు చేస్తారా..? అని కెటిఆర్ ప్రశ్నించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇంతటి నిరంకుశ విధానాలను అవలంభిస్తారా అని అడిగారు. ఇది ప్రజా పాలన కాదని, ముమ్మాటికీ ప్రజాకంఠక పాలన అని మండిపడ్డారు. ప్రచారంలో ఒక మాట, ప్రభుత్వంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్న సిఎం రెండు నాల్కల వైఖరి తెలంగాణ యువతకు అర్థమైపోయిందని అన్నారు. అ క్రమంగా అరెస్టు చేసిన వారందరిని బేషరతుగా వెంటనే విడుదల చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాలు చేపట్టడంలో, జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు, వెంటనే నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కారు క్షమాపణలు చెప్పాలని అన్నా రు. నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చకుండా నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ సర్కారును ఈ పాపం శాపమై భూస్థాపితం చేయడం ఖాయమని పేర్కొన్నారు.

హక్కులను అణగదొక్కే కుట్రలు : హరీశ్‌రావు
హామీలు ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, డిమాండ్ల సాధనే లక్ష్యంగా టిజిపిఎస్‌సి వద్ద శాంతియుత నిరసన తెలిపేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేసి నిర్భందించడం హేయమైన చర్యగా బిఆర్‌ఎస్ అగ్రనాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా నిరుద్యోగులకు లేదా..? అని ప్రశ్నించారు. తమ గోసను చెప్పుకునే అవకాశం కూడా లేదా అని నిలదీశారు. ఒకవైపు ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూ నిరుద్యోగుల గొంతులు, హక్కులను అణగదొక్కే కుట్రలకు రేవంత్ సర్కార్ పాల్పడుతోందని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News