Sunday, December 22, 2024

టిఎన్‌జిఒ భవన్‌పై నిరుద్యోగ జెఎసి దాడి

- Advertisement -
- Advertisement -

టిఎన్‌జిఒ భవన్‌పై
నిరుద్యోగ జెఎసి దాడి
బిజెపి సారథ్యంలో సాగుతున్న సంఘం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా టిఎన్‌జివో నాయకులు వ్యక్తిగత ప్ర యోజనాల కోసమే పని చేస్తున్నారని ఆరోపిస్తూ బిజెపి ఆ ధ్వర్యంలోని నిరుద్యోగ జెఎసి నేతలు మంగళవారం టిఎన్‌జివో భవన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా టిఎన్‌జివో అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజేందర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని ని నాదాలు చేశారు. భవన్ లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకుని, అరెస్టు చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 317 జీవో వలన భార్య ఒక చోట, భర్త మరో చోట పని చేస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటునారని , వారి గురించి పట్టించుకోవడం లేదని ఆందోళనకారులు మండిపడ్డారు. ఉద్యోగులకు సంబంధించిన విషయాల్లో మామిళ్ల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా వత్తాసు పలుకుతున్నారని జెఎసి నేతలు ఆరోపించారు. ఉద్యోగుల వయో పరిమితి 59 నుంచి 61 సంవత్సరాలకు పెంచి నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుదని వారు ఆరోపించారు. తక్షణ ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని, నిరుద్యోగ భృతి విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా ఈ దాడిని ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News