Wednesday, January 22, 2025

కెపిహెచ్‌బి హాస్టల్‌లో నిరుద్యోగి సూసైడ్

- Advertisement -
- Advertisement -

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో సోమవారం ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రైవేట్ హాస్టల్ లో ఉంటున్న సారెపల్లి సాయి వంశీ.. రూంలో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. సాలార్ గ్రామం, మాన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగ కోసం వంశీ హైదరాబాద్ వచ్చాడు. కెపిహెచ్‌బిలోని శ్రీ వేంకట సాయి మెన్స్ పీజీ హాస్టల్ లో ఉన్నాడు. హాస్టల్ గదిలో ఎవరు లేని టైం చూసి సాయి వంశీ ఫ్యానుకు ఉరి వేసుకున్నాడు. ఆత్మహత్యకి గల కారణాలు వెల్లడి కావాల్సి ఉంది. కేసు పోలీసుల దర్యాప్తులో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News