Monday, December 23, 2024

నిరుద్యోగులు జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/తొర్రూరు : నిరుద్యోగ యువతీ, యువకుల కోసం పోలీసు ఆధ్వర్యంలో జాబ్‌మేళాను నిర్వహించడం జరుగుతుందని ఈ జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌ఐ గండ్రాతి సతీశ్ అన్నారు. గురువారం మండలంలోని అమ్మాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఎస్‌ఐ పాల్గొని మాట్లాడుతూ ఈ నెల 16న తొర్రూరులోని ఆర్యభట్ట హైస్కూల్‌లో నిరుద్యోగ యువతీ, యువకులకు 60 కంపెనీల ఆధ్వర్యంలో ఉచిత మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ కడెం యాకయ్య, పాలకవర్గం, నాయకులు, గ్రామ పెద్దలు కలిసి ఎస్‌ఐను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి 2 ముద్దం విక్రంరెడ్డి, వార్డు సభ్యులు జగన్, అరవింద్, శ్రీకాంత్, సంతోశ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రావణి, గ్రామ పెద్దలు రామారావు, మహబూబ్‌రెడ్డి, అచ్చిరెడ్డి, అశోక్‌రెడ్డి, శ్రీనివాస్, సంజీవరెడ్డి, తులసిరామ్, యూత్ నాయకులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, ఎఎన్‌ఎంలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News