హైదరాబాద్: వీరనారి ఐలమ్మ యూనివర్శిటీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. పాత భవనాలను రెన్నోవేషన్ చేస్తున్నామని అన్నారు. మూసీ ప్రక్షాలనలో భాగంగా యూనివర్శిటీ ప్రధాన ద్వారం సుందరీకరిస్తున్నామని, ప్రధాన ద్వారం సుందరీకరణకు రూ. 520 కోట్లు కేటాయిస్తున్నారని చెప్పారు. ఎస్సి,ఎస్టి సబ్ ప్లాన్ నిధులను నిరుద్యోగ యువతకు కేటాయించాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని వెల్లడించారు. రూ. 6 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం ప్రారంభం కానుందని అన్నారు. ఎస్సి,ఎస్టి, బిసి, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు…స్వయం ఉపాధి కింద రూ.3 లక్షలు తగ్గకుండా ఆర్థిక సాయం అందుతుందని, ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 5 వరకు అప్లికేషన్ ప్రాసెస్ జరిపి, మే 31 లోగా సెలెక్షన్ ప్రాసెస్ పూర్తి చేస్తామని తెలియజేశారు. జూన్ 2 న సెలెక్ట్ అయన వారికి లెటర్స్ ఇస్తామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
నిరుద్యోగ యువతకు రూ.3 లక్షలు సాయం
- Advertisement -
- Advertisement -
- Advertisement -