Monday, December 23, 2024

నిరుద్యోగులను మోసం చేసే పాలకులపై యువత నిరంతర పోరాటాలు చేయాలి

- Advertisement -
- Advertisement -
ఎఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. తిరుమలై రామన్

హైదరాబాద్ : నిరుద్యోగులను మోసం చేసే పాలకులపై యువత నిరంతరం పోరాటాలు చేయాలని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై యువత ఉద్యమించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. తిరుమలై రామన్ పిలుపునిచ్చారు. ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర విస్తృత స్థాయి కౌన్సిల్ సమావేశం హిమాయత్ నగర్ లోని సత్యనారాయణ రెడ్డి భవన్ లో రాష్ట్ర అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కార్య దర్శి ఆర్. తిరుమలై రామన్ ముఖ్య నేతగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.తిరుమలై రామన్ మాట్లా డుతూ యువతకు ఉపాధి హామీ కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వ తీరు అప్రజాస్వామికమన్నారు. అదే విధంగా ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్య దర్శి వలి ఉల్లా ఖాద్రీ, కె.ధర్మేంద్రలు సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ అంశంపై ఎఐవైఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు చేయను న్నట్లు వారు తెలిపారు.

నిరంకుశ విధానాలపై యువత సంఘటిత ఉద్యమాలలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఉపాధి కల్పించే వారికే రాను న్న ఎన్నికల్లో ఓటు అనే నినాదంతో యువతను చైతన్యపర్చనున్నామని వారు అన్నారు.ఈ సమావేశంలో ఎఐవైఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ నిర్లకంటి శ్రీకాంత్, కనుకుంట్ల శంకర్, లింగం రవి,వెంకటేశ్వర్లు,యుగంధర్, కార్యవర్గ సభ్యులు రామకృష్ణ, సత్య ప్రసాద్, ఆర్.బాలకృష్ణ, బిజ్జ శ్రీనివాస్, లక్ష్మణ్, కిషోర్, సల్మాన్,మహేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News