Saturday, November 23, 2024

నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలి

- Advertisement -
- Advertisement -
  • బిజెపి హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ

సుబేదారి: నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని హన్మకొండ జిల్లా యువమోర్చా అధ్యక్షుడు తీగల భరత్‌గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాకు బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ హాజరై కలెక్టర్ క్యాంపు ఆఫీస్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న బీజేపీ, బీజేవైఎం నాయకులను పోలీసులు అరెస్టు చేసి సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా రావు పద్మ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అనేక మంది యువకులు, నిరుద్యోగుల ఆత్మ బలిదానాల వల్ల ఏర్పడిన రాష్‌ట్రంలో ఏళ్లు గడిచినా నోటిఫికేషన్లు ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా కాలక్షేపం చేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెపుతారన్నారు.

కేయూలో శాశ్వతమైన ఉపాధ్యాయ సిబ్బంది లేక అధునాతన కోర్సులు లేవన్నారు. ఐటీ హబ్ తయారుచేసి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రస్తుత పాలకులు డంపింగ్ యార్డు పక్కన ఐటీ కంపనీలకు స్థలం కేటాయించడం వల్ల డంపింగ్ యార్డు నుంచి వస్తున్న పొగ, ధుమ్ము, ధూళి వల్ల వచ్చిన ఒకటి రెండు ఐటీ కంపనీలు వెళ్లి పోతున్నాయన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు యువత కోసం ఉపాధి మరిచి ప్రజల భూముల కబ్జాలపై దృష్టి పెట్టారన్నారు.

ఆర్టీసీ టైర్ కర్మాగారాన్ని ఎత్తేసిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రధాని మోడీ రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసినా దానికి మొహం లేక బీఆర్‌ఎస్ ప్రతినిధులు గైర్హాజరయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ కందగట్ల సత్యనారాయణ, జిల్లా నాయకులు చిర్ర నర్సింగ్‌గౌడ్, గై సారంగపాణి, నర్మెట్ట శ్రీనివాస్, దేవరకొండ అనిల్, గొర్రె ఓంప్రకాష్, ఆకుల శ్రీకాంత్, మ్యాదరబోయిన మధుచంద్ర, గందసిరి శ్రీకాంత్, యువమోర్చా నాయకులు కల్లూరి పవన్, దివాకర్, నిఖిల్ చోప్రా, గౌతమ్, వెంకటరమణ, సాయితేజ, సిద్దు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News