Thursday, January 23, 2025

ఏప్రిల్‌లో 4 నెలల గరిష్ఠానికి నిరుద్యోగ రేటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారతదేశంలో నిరుద్యోగిత రేటు నాలుగు నెలల గరిష్ఠానికి పెరిగింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) ప్రకారం, ఇది ఏప్రిల్‌లో 8.11 శాతానికి పెరిగింది. అంతకుముందు మార్చిలో నిరుద్యోగిత రేటు 7.80 శాతంగా ఉంది. ఫిబ్రవరిలో ఇది 7.45 శాతంగా ఉంది. అయితే గ్రామీణ నిరుద్యోగం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఇది ఒక నెల క్రితం 7.47 శాతం నుండి 7.34 శాతానికి పెరిగింది. ఇక పట్టణ నిరుద్యోగం 8.51 శాతం నుండి 9.81 శాతానికి పెరిగింది. నివేదిక ప్రకారం, ఏప్రిల్ నెలలో 87 శాతం మంది ప్రజలు ఉపాధిని పొందడంలో విజయం సాధించారు. మిగతా నిరుద్యోగంలో ఉన్నారు. గత సంవత్సరం అంటే 2022లో నిరుద్యోగం రేటు మూడుసార్లు 8 శాతం దాటింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News