Wednesday, December 25, 2024

3 నెలల గరిష్ఠానికి నిరుద్యోగ రేటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారతదేశంలో నిరుద్యోగం రేటు పెరుగుతోంది. మార్చి నెలలో నిరుద్యోగం రేటు 7.80 శాతానికి పెరగ్గా, ఇది మూడు నెలల్లో అత్యధికం. ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశంపై ప్రభావం పడింది. దీంతో భారత్ నిరుద్యోగ రేటు మూడు నెలల గరిష్ఠానికి చేరింది. అంతకుముందు ఫిబ్రవరిలో నిరుద్యోగం రేటు 7.45 శాతంగా ఉంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) ఈ నిరుద్యోగ రేటు గణాంకాలను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం, పట్టణ నిరుద్యోగ రేటు ఫిబ్రవరి నెలలో 7.93 శాతం నుండి మార్చిలో 8.51 శాతానికి పెరిగింది.

కాగా గ్రామీణ నిరుద్యోగ రేటు 7.23 శాతం నుంచి 7.47 శాతానికి పెరిగింది. చత్తీస్‌గఢ్‌లో నిరుద్యోగ రేటు మార్చి నెలలో 0.8 శాతంగా ఉండగా, దేశంలో ఇదే అతి తక్కువ నిరుద్యోగిత రేటు కావడం గమనార్హం. ఈ నెలలో అత్యధిక నిరుద్యోగ రేటు హర్యానాలో 26.8 శాతంగా ఉంది. మార్చిలో 7.8 శాతం ఉన్న నిరుద్యోగ రేటు అంటే పని చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతి 1000 మంది కార్మికులలో 78 మందికి పని దొరకడం లేదు. సిఎంఐఇ ప్రతి నెలా 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల ఇంటింటికి సర్వే నిర్వహిస్తోంది. వారి ఉద్యోగ స్థితి గురించి సమాచారాన్ని తీసుకుంటుంది. దీని తరువాత పొందిన ఫలితాల నుండి ఒక నివేదిక తయారు చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News