Sunday, December 22, 2024

“హోయసల” ఆలయాలకు యునెస్కో వారసత్వ గుర్తింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో భారత్ లోని మరో చారిత్రక కట్టడం వచ్చి చేరింది. కర్ణాటక లోని హోయసల ఆలయాలను ఈ జాబితాలో చేర్చినట్టు యునెస్కో వెల్లడించింది. ప్రసిద్ధి చెందిన బేలూర్, హళేబీడ్, సోమనాథ్‌పుర ఆలయాలను కలిపి ఈ అంతర్జాతీయ గుర్తింపు ఇస్తున్నట్టు వివరించింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో జరుగుతోన్న 45 వ వరల్డ్ హెరిటేజ్ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

పశ్చిమబెంగాల్ లోని శాంతినికేతన్ కు గుర్తింపు లభించిన మరుసటి రోజే హోయసల ఆలయాలు ఈ జాబితాలో చేరడం విశేషం. హోయసలకు ఈ గౌరవం దక్కడంపై ప్రధాని మోడీ స్పందించారు. ఆలయాలపై చెక్కిన సమాచారం , అద్భుత శిల్పకళ భారత సాంస్కృతిక వారసత్వం, పూర్వీకుల కళా నైపుణ్యానికి నిదర్శనం అని ట్వీట్ చేశారు. 2014 ఏప్రిల్ 15 నుంచే యునెస్కో పరిశీలన జబితాలో ఈ ఆలయాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News