హరప్పా నాగరికత కాలం నాటి ధోలవిరాకు యునెస్కో గుర్తింపు
ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం
న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన మరో ప్రాచీన పట్టణానికి అరుదైన గుర్తింపు లభించింది. గుజరాత్‌లోని ధోలవిరాను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ప్రకటించింది. ఈ మేరకు ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ధోలవిరాను చేర్చినట్లు యునెస్కో ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఇటీవలే తెలంగాణకు చెందినప్రసిద్ధ రామప్ప ఆలయానికి యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. ధోలవిరా గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉంది. హరప్పా నాగరికత కాలంలో ప్రసిద్ధ పట్టణం. 5 వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఆధునిక వసతులతో కూడిన నాగరిక జీవనం ఉండింది.1967 68లో జెపి జోషీ నేతృత్వంలోని పురావస్తు శాఖ బృందం ఈ ప్రాంతాన్ని గుర్తించింది. హరప్పా నాగరికతలోని ఎనిమిది ప్రముఖ ప్రాంతల్లో ఇది ఐదో అతిపెద్ద ప్రాంతం కావడం విశేషం. దీంతో మన దేశంలోని ప్రపంచ వారసత్వ సంపదల సంఖ్య 40కి చేరుకుంది. గుజరాత్‌లో మొత్త నాటుగు ప్రపంచ వారసత్వ సంపదలున్నాయి. అవి ధోలవిరా, పావ్‌గఢ్ సమీపంలలోని చంపనేర్, పటాన్‌లోని రాణీకి వన్, అహ్మదాబాద్. ధోలవిరాకు వరల్డ్ హురిటేజ్ జాబితాలో చోటు లభించడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భారతీయులు ముఖ్యంగా గుజరాత్ ప్రజలు ఎంతో గర్వించాల్సిన రోజన్నారు. 2014నుంచి భారత్‌లో పది ప్రపంచ వారసత్వ సంపదల జాబితాలో చేరాయని, ఇది మొత్తం సైట్లలో నాలుగో వంతని, ప్రధాని మోడీ కమిట్‌మెంట్ వల్లే ఇది సాధ్యమైందని కిషన్ రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ప్రధాని హర్షం
ధోలవిరాను యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించడంపట్ల ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన ఈ ప్రాంతంలో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. ‘కచ్చితంగా ఇది చాలా సంతోషకరమైన వార్త. ధోలవిరా చాలా ముఖ్యమైన పట్టణ కేంద్రం. ప్రతి ఒక్కరూ ముఖ్యంగా చరిత్ర, సంప్రదాయాలు, పురావస్తు శాస్త్రంపై ఆసక్తి ఉన్న వాళ్లు తప్పకుండా చూడాల్సిన ప్రాంతం. నేను విద్యార్థిగా ఉన్న సమయంలో మొదటిసారి ధోలవిరాకు వెళ్లాను. ఆ ప్రాంతాన్ని చూసి మైమరిచిపోయాను. తర్వాత గుజరాత్ సిఎంగా ఉన్నప్పుడు మరోసారి అక్కడికి వెళ్లే అవకాశం లభించింది. అక్కడ పర్యాటకులకు వసతి సదుపాయాలు కల్పించేందుకు మా బృందం కృషి చేసింది’ అంటూ నాటి ఫొటోలను ప్రధాని షేర్ చేశారు.
🔴 BREAKING!
Dholavira: A Harappan City, in #India🇮🇳, just inscribed on the @UNESCO #WorldHeritage List. Congratulations! 👏
ℹ️ https://t.co/X7SWIos7D9 #44WHC pic.twitter.com/bF1GUB2Aga
— UNESCO 🏛️ #Education #Sciences #Culture 🇺🇳 (@UNESCO) July 27, 2021
UNESCO recognition Harappan City Dholavira