- Advertisement -
లండన్ : ప్రపంచ ప్రాచీన వారసత్వ సంపద జాబితాలో మరో ప్రముఖ ప్రకృతి సంపద వచ్చి చేరింది. బ్రిటన్ లోని వాయువ్య వేల్స్‌లో సహజ ప్రకృతి పలక గనులుగా ప్రసిద్ధి చెందిన వెల్ష్‌స్లేట్ మైన్స్‌కు యునెస్కో గుర్తింపు లభించింది. తాజ్‌మహల్, చైనా గ్రేట్‌వాల్, ఈజిప్టు పిరమిడ్లు, తెలంగాణ లోని రామప్ప తదితర ప్రసిద్ధ కట్టడాల జాబితాలో ఈ వెల్స్‌స్లేట్ మైన్స్ చేరడంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, వరల్డ్ హెరిటేజి కమిటీ మద్దతు పలికారు. బ్రిటన్‌లో ఇది 32 వ ప్రపంచ సంపదగా, ప్రపంచం లోని మొత్తం 1149 ప్రసిద్ధ కట్టడాల్లో నాలుగోదిగా గుర్తింపు పొందింది. ఈ పలక గనుల ప్రదేశాన్ని ఎలాంటి విధ్వంసం జరగకుండా చట్టపరమైన రక్షణ లభించింది. రోమన్ల కాలం నుంచి కూడాఈ వెల్ష్‌స్లేట్ మైన్స్‌కు చెందిన పలకలను భవనాల పైకప్పులకు వాడుతున్నారు. ఏటా వేలాది మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని దర్శిస్తుంటారు.
- Advertisement -