ఉప్పల్ భగాయత్ ప్లాట్ల వేలానికి అనూహ్య స్పందన
23 ప్లాట్లకు రూ.141.61కోట్లు, గజం రూ.లక్షా ఒక వెయ్యి,
అతి తక్కువగా గజానికి రూ.53వేలు, నేడు మరి 21 ప్లాట్లకు వేలం
గజానికి రూ.1,01,000లు అధిక ధర
అతి తక్కువగా గజానికి రూ. 53వేలు
ఉప్పల్ భగాయత్ ప్లాట్ల వేలానికి అనూహ్య స్పందన
సంతోషం వ్యక్తం చేసిన పురపాలక శాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్
నేడు మరో 21ప్లాట్లకు వేలం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉప్పల్ భగాయత్ లే ఔట్‌లలోని ప్లాట్ల వేలానికి మొదటిరోజు అనూహ్య స్పందన వచ్చింది. మొదటిరోజు 23 ప్లాట్లకు వేలం జరగ్గా గజానికి అధికంగా రూ.1,01,000ల ధర పలకగా, అతి తక్కువగా రూ.53వేల ధర పలికిందని హెచ్‌ఎండిఏ అధికారులు తెలిపారు. మొత్తం 44 ప్లాట్లకు గాను ఈ వేలాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 23 ప్లాట్లను వేలం వేయగా రూ.141.61 కోట్ల ఆదాయం హెచ్‌ఎండిఏకు సమకూరింది. 150 గజాల ప్లాట్ల నుంచి 1787 గజాల పైచిలుకు ప్లాట్ల వరకు ఈ వేలాన్ని హెచ్‌ఎండిఏ అధికారులు మొదటిరోజు నిర్వహించారు. మొత్తం 19,719 గజాల ప్లాట్లను ఈ వేలంలో వివిధ వర్గాలకు చెందిన వారు సొంతం చేసుకోగా సుమారుగా 141.61 కోట్ల ఆదాయం హెచ్‌ఎండిఏకు వచ్చింది.
మొదటిరోజు జరిగిన వేలంపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేలం పారదర్శకంగా జరిగిందని, అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన కితాబునిచ్చారు. రెండోరోజూ (శుక్రవారం) 21 ప్లాట్లను హెచ్‌ఎండిఏ అధికారులు ఈ వేలం నిర్వహించనున్నారు. ఉప్పల్ భగాయత్‌లోని భాగంగా మొదటిరోజు ప్లాట్ల వేలానికి సంబంధించి ఈ ఆక్షన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉదయం జరిగిన వేలంలో గజం ధర
అధిక ధర రూ.77,000
తక్కువ ధర రూ.53,000
యావరేజీగా రూ.67,145
మొత్తం రూ.97,27,05,000
మధ్యాహ్నం జరిగిన వేలం వివరాలు
అధిక ధర రూ.1,01,000
తక్కువ ధర రూ.73,000
యావరేజీగా రూ.84,744
మొత్తం రూ.44,34,25,000