Saturday, December 21, 2024

బెంగాల్‌లో ఓ వర్చువల్ కార్యక్రమంలో ప్రధాని మోడీకి ఊహించని షాక్..!

- Advertisement -
- Advertisement -

Unexpected shock to Prime Minister Modi at a virtual event in Bengal ..!

క్యాన్సర్ రోగులకు క్యాంపస్ ప్రారంభం సందర్భంగా
అంతకుముందే దానిని ప్రారంభించామన్న మమత

కోల్‌కతా: బెంగాల్‌లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోడీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నుంచి ఊహించని షాక్ తగిలింది. శుక్రవారం కోల్‌కతాలో చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ (సిఎన్‌సిఐ)లో రెండో క్యాంపస్‌ను ప్రారంభించే సందర్భంగా ప్రధాని మోడీకి మమత షాకిచ్చారు. ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించిన తర్వాత వరుసగా ఇద్దరు నేతలు ప్రసంగించారు. దేశంలో ఆరోగ్య రంగంలో తాను చేపట్టిన కార్యక్రమాల గురించి చెబుతూ సిఎన్‌సిఐలో రెండో క్యాంపస్ కూడా అందులో భాగమేనని ప్రధాని అన్నారు. ఆ తర్వాత ప్రసంగించిన మమత అది అంతకుముందే తాము ప్రారంభించిన క్యాంపస్ , మీరెలా ప్రారంభిస్తారంటూ ప్రధానికి షాకిచ్చారు.

అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందని, దానికి అవసరమైన 11 ఎకరాల స్థలం కూడా తామిచ్చామని మమత చెప్పుకొచ్చారు. మరోవైపు ఈ కార్యక్రమానికి అసెంబ్లీలో బిజెపి నేత సువేందు అధికారిని ఆహ్వానించడం కూడా మమతకు ఆగ్రహం తెప్పించింది. ప్రొటోకాల్‌ను ఉల్లంఘించడమేనని ఆమె అంతకుముందే ఆక్షేపించినా ప్రధాని కార్యాలయం పట్టించుకోలేదు. ఈ సందర్భంగా ప్రధాని తన ప్రసంగంలో దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ గురించి ప్రస్తావించారు. 150 కోట్ల డోసుల మార్క్‌ను చేరుకున్నామని తెలిపారు. అర్హులైన 90 శాతం పౌరులకు కనీసం ఒక్క డోసు పంపిణీ చేశామన్నారు. ఇటీవల 15-17 ఏళ్లవారికి చేపట్టిన వ్యాక్సినేషన్‌లో ఐదు రోజుల్లోనే 1.5 కోట్లమందికి టీకాలందించామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News