Friday, November 22, 2024

నా కుమారుడిపై ప్రధాని మోడీ వ్యాఖ్యలు బాధాకరం: స్టాలిన్

- Advertisement -
- Advertisement -

చెన్నై: సనాతన ధర్మంపై తన కుమారుడు, మంత్రివర్గ సహచరుడు ఉదయధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం తలెత్తిన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ గురువారం స్పందించారు. సనాతన ధర్మంలో బోధించిన అమానవీయ సిద్ధాంతాల గురించి మాత్రమే తన కుమారుడు వ్యాఖ్యానించాడని ఆయన తెలిపారు.

అమానవీయ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు సహించలేక బిజెపి అనుకూల శక్తులు తన కుమారుడి వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టాయని, సనాతన ధర్మాన్ని పాటించేవారిని చంపివేయాలంటూ తన కుమారుడు ప్రకటించినట్లు తప్పుడు వక్రీకరణలకు పాల్పడుతున్నాయని స్టాలిన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయనిధిని లక్షంగా చేసుకుని దాడికి పాల్పడుతున్నవారితో ప్రధాని నరేంద్ర మోడీ చేతులు కలపడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

ఊ మతాన్ని కాని, మత విశ్వాసాలను కాని గాయపరచకుండా కేవలం ఎస్‌సిలు, ఎస్‌టిల పట్ల వివక్ష చూపుతున్న సనాతన సిద్ధాంతాలపై మాత్రమే ఉదయనిధి తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడని ఆయన తెలిపారు. బిజెపి పెంచిపోషిస్తున్న సోషల్ మీడియా మూకలు రెచ్చిపోయి ఉత్తరాది రాష్ట్రాలలో తన కుమారుడికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తన కుమారుడు జెనొసైడ్(మారణ కాండ) అనే పదాన్ని తమిళంలోకాని ఇంగ్లీష్‌లోకాని ఎక్కడా ఉచ్ఛరించలేదని, అయినప్పటికీ బిజెపికి చెందిన సోషల్ మీడియా మూకలు అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

కేంద్ర అమిత్ షా, రాజనాథ్ సింగ్ ఇదే అసత్యాన్ని ఖండిస్తూ ప్రకటలు ఇచ్చారని, ఉదయనిధి నుంచి వివరణ వచ్చినప్పటికీ ఈ కేంద్ర మంత్రులు మాత్రం తమ ప్రకటనలను వెనక్కు తీసుకోలేదని స్టాలిన్ తెలిపారు.

కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉదయనిధి వ్యాఖ్యలకు తగిన విధంగా జవాబు ఇవ్వాలిసన అవసరం ఉందని అన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు రావడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఎటువంటి సమాచారాన్నయినా తెప్పించుకునే వనరులు ప్రధానికి ఉంటాయని, ఉదయనిధికి సంబంధించి వ్యాప్తిచేస్తున్న అసత్యాల గురించి తెలుసుకోకుండానే ప్రధాని మోడీ మాట్లాడారా లేక తెలిలిసే మాట్లాడారా అంటూ స్టాలిన్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News