Sunday, December 22, 2024

మోడీపై డీఎంకే చీఫ్ స్టాలిన్ ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ గురువారం నాడు ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. సనాతన ధర్మంపై తన కుమారుడు , రాష్ట్రమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల గురించి తెలియకుండానే వ్యాఖ్యలు చేయడం సరికాదని దుయ్యబట్టారు.ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన జారీ చేశారు. ప్రధాని మోడీ బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీని గురించి ప్రస్తావించినట్టు వార్తలు వచ్చాయి.

ఈ వ్యాఖ్యలకు దీటుగా , రాజ్యాంగ బద్ధంగా, వాస్తవాలు చెబుతూ స్పందించాలని కేంద్ర మంత్రులను ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను సమర్థించారు. ప్రధాని మోడీపై మండిపడ్డారు. ప్రజలను అణచివేసే సనాతన ఆలోచనలను నిర్మూలించాలని ఉదయనిధి పిలుపునిచ్చారన్నారు. బీజేపీ పోషిస్తున్న సామాజిక మాథ్యమాల మూకలు ఉత్తరాది రాష్ట్రాల్లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయన్నారు.

ఉదయనిధి తలకు వెల కట్టిన స్వామీజీపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని,కానీ ఉదయనిధి పై మాత్రం కేసులు నమోదు చేసిందని దుయ్యబట్టారు. అదే సమయంలో ప్రధానమంత్రి మోడీ మంత్రివర్గ సమావేశంలో ఉదయనిధి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ దీటుగా బదులివ్వాలని చెప్పడం తనను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందని చెప్పారు. ఏ వార్త అయినా నిజమైనదా ? కాదా ? సరిచూసుకునేందుకు ప్రధాన మంత్రికి అన్ని వనరులు అందుబాటులో ఉంటాయని , ఉదయనిధి గురించి జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలను తెలుసుకోలేక పోతున్నారా ? తెలిసి కూడా మాట్లాడుతున్నారా ? అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News