Sunday, December 22, 2024

“పాక్ ఆక్రమిత కశ్మీర్ విముక్తి” ఒక్కటే అసంపూర్తి ఎజెండా : విహెచ్‌పి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించడంపై సుప్రీం కోర్టును విశ్వహిందూ పరిషత్ ప్రశంసించింది. అయితే ఇంకా ‘పాక్ ఆక్రమిత కశ్మీర్ విముక్తి’ ఒక్కటే అసంపూర్తి ఎజెండాగా ఉందని పేర్కొంది. పటిష్టమైన భారత్ దృఢ నిర్ణయమే త్వరలో పాక్ నుంచి కశ్మీర్‌ను విముక్తి చేస్తుందని తాము నమ్మకంతో ఉన్నామని విశ్వహిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ గొప్ప త్యాగానికి యావత్ జాతి నివాళి అర్పించడమేనని ప్రశంసించారు.

ఆనాటి రాచరిక రాష్ట్రమైన జమ్ము కశ్మీర్ ఆఖరి పాలకుడు మహారాజా హరిసింగ్ తన రాష్ట్రాన్ని భారత్‌లో విలీనం చేయడానికి అంగీకరిస్తూ 1947 48 లో సంతకం చేసిన లేఖను సుప్రీం కోర్టు తన తీర్పులో ఉదహరించిందని చెప్పారు. ఆమేరకు ఇది తుది నిర్ణయమని, తిరుగులేనిదని కుమార్ వివరించారు. కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ ఆనాటి రాజకీయ నాయకత్వం జమ్ముకశ్మీర్‌కు ఆర్టికల్ 370 ద్వారా ప్రత్యేక హోదా ఇవ్వడం కొంత “రాజకీయ అపార్ధాలు” గా వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News