Sunday, December 22, 2024

మరిచిపోలేని గాయాలు ఎన్నో : ఈటల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : మిర్చి పంటకు మద్దతు కావాలని రైతులు అడిగితే ఇదే ఖమ్మం జిల్లాలో సంకెళ్లు వేయించి.. మరచిపోని గాయాలు ఎన్నో చేశారని బిజెపి రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. శనివారం వైరా శాసనసభ నియోజకవర్గ స్థాయి బిజెపి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చి మిగతా సబ్సిడీ పరికరాలు అన్నీ ఎగబెట్టారని ఆరోపించారు. పంట నష్టపోతే కేంద్రం అందించే ఫసల్ భీమా యోజనకు రాష్ట్ర ప్రభుత్వ వాటా కట్టకుండా నష్టపరిహారం అందకుండా చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు డాక్టర్ పొంగులేటి సుధాకర రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, రవీంద్ర నాయక్, శ్రీధర్ రెడ్డి, నంబూరి రామలింగేశ్వరరావు, జిల్లా బిజెపి అధ్యక్షులు గల్లా సత్యనారాయణ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News