Wednesday, January 22, 2025

సచివాలయంలో జాతీయ పతాకావిష్కరణ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని సచివాలయంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు. ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆమె జాతీయ పతాకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ ఐఎఎస్ అధికారులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అదే విధంగా అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్యభవన్‌లో తెలంగాణ జాతీయ సమైక్యతా వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివర్ణ పతాకాన్ని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియాల్ ఆవిష్కరించారు. ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News