Monday, December 23, 2024

మానవ హక్కుల మండలి నుంచి రష్యా సస్పెండ్ !

- Advertisement -
- Advertisement -

UN suspends Russia

న్యూయార్క్ : 2020లో ఎన్నుకోబడిన మానవ హక్కుల మండలి (HRC) నుంచి  రష్యా సభ్యత్వం గురువారం సస్పెండ్ చేయబడింది.  ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA)లో  అనుకూలంగా 93, వ్యతిరేకంగా 24 ఓట్లతో, భారతదేశంతో సహా 58 మంది గైర్హాజరుకాగా, రష్యాను  ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నుంచి  సస్పెండ్ చేసే తీర్మానాన్ని ఆమోదించారు.

‘మానవ హక్కుల మండలిలో రష్యన్ ఫెడరేషన్ యొక్క సభ్యత్వ హక్కుల సస్పెన్షన్’  తీర్మానాన్ని  ఉక్రెయిన్,అమెరికా, యూరొపియన్ యూనియన్ సహా అనేక లాటిన్ అమెరికన్ దేశాలను కలిగి ఉన్న దేశాల సమూహం ప్రతిపాదించింది.   మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం.  ‘హాజరు మరియు ఓటింగ్’ యొక్క గణనలో హాజరుకానివారు లెక్కించబడరు. కారణాంతరాల వల్ల భారతదేశం ఓటింగ్ కు  దూరంగా ఉంది, U.N. (UNPR)కి దాని శాశ్వత ప్రతినిధి టి.ఎస్. తిరుమూర్తి అన్నారు.

“భారతదేశం ఏదైనా పక్షాన్ని ఎంచుకుంటే, అది శాంతి వైపే.   ఇది హింసకు తక్షణ ముగింపు కోసం,” అని  తిరుమూర్తి అన్నారు, దౌత్యం కోసం పిలుపునిచ్చారు.  ఈ వారం ప్రారంభంలో UN భద్రతా మండలికి భారతదేశం ఇచ్చిన సందేశాన్ని పునరుద్ఘాటించారు. కీవ్ శివారు బుచాలో  పౌరుల హత్య తీవ్రంగా కలవరపరిచింది,  దానిని భారతదేశం  నిస్సందేహంగా ఖండించింది . కానీ ఈ హత్యలకు రష్యాను భారత్  నిందించలేదు. బుచాలో పౌరుల హత్యలో రష్యన్ల  ప్రమేయం ఉందని జర్మన్ ప్రభుత్వం ఉపగ్రహ సమాచారం ఉటంకిస్తోందని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. కాగా ఈ మరణాల వెనుక రష్యా సైనికుల హస్తం ఉందనడాన్ని మాస్కో ఖండించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News