Monday, December 23, 2024

రైల్వే స్టేషన్ ఎదుట అపరిశుభ్రంగా తినుబండారాలు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: నగరంలోని రైల్వే స్టేషన్ ఎదుట అపరిశుభ్రంగా తినుబంఢారాలు విక్రయిస్తున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో హోటళ్ల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో పలు హోటళ్లలో వాడిన నూనెతోపాటు బజ్జీలు, పూరీలు లాంటివి నాసిరకం నూనెలు వాడుతూ తినుబండారాలను అమాయక ప్రజలకు అంటగడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి రైల్వే స్టేషన్ ఎదుట తినుబంఢారాల హోటళ్లలో పరిశుభ్రతపాటించేలా చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News